జర్మనీ పార్లమెంటుపై దాడి కుట్రను పోలీసులు చేధించారు. పార్లమెంటుపై దాడి చేసేందుకు ప్లాన్ చేసిన వారిని వ్యూహాత్మకంగా పట్టుకున్నారు. ఆ దేశంలోని 'సిటిజన్స్ ఆఫ్ ది రీచ్' అనే సంస్థ ప్రస్తుత ప్రభుత్వాన్ని కూల్చేసి, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కుట్ర పన్నింది. సాయుధ బృందంతో జర్మన్ పార్లమెంటులోకి చొరబడి, దాడులు చేసేందుకు ప్రణాళికలను రూపొందించింది. దీంతో వారి కుట్రను భగ్నం చేసిన పోలీసులు 25 మందిని అదుపులోకి తీసుకున్నారు.