ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో నోటాకు 57 వేలకుపైగా ఓట్లు పడ్డాయి. ఢిల్లీలో మొత్తం 1,45,05,358 ఓటర్లు ఉన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 50.48 శాతం మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 57,545 మంది నోటాకు ఓటేశారు. అంటే 0.78 శాతం మంది తమకు ఏ అభ్యర్థి నచ్చలేదని ఓటువేయడం గమనార్హం. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార ఆప్ పార్టీ మరోసారి సత్తా చాటింది. బీజేపీని మట్టికరిపించిన చీపురుపార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.