ఏపీలో వచ్చే సంవత్సరానికి సంబంధించి ఇంటర్ కళాశాలకు అఫిలియేషన్ పొడిగింపు, అదనపు సెక్షన్ల మంజూరు దరఖాస్తు గడువును ఈ నెల 23 వరకు ఇంటర్ బోర్డు పొడిగించింది. తొలుత ప్రకటించిన గడువు నేటితో ముగియనుంది. కాగా, గడువు పొడిగించాలని పలు కాలేజీల అభ్యర్థనల మేరకు గడువు పొడిగించారు. రూ.10వేల అపరాధ రుసుముతో ఈ నెల 24 నుండి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. కళాశాలల్లో ఆర్ఐఓల తనిఖీలు ఈనెల 15 నుండి జనవరి 3 వరకు కొనసాగుతాయని పేర్కొంది.