లంక ప్రీమియర్ లీగ్ లో భాగంగా బుధవారం క్యాండీ ఫాల్కన్స్, గాలె గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ లీగ్ లో శ్రీలంక క్రికెటర్ చమికా కరుణరత్నే క్యాండీ ఫాల్కన్స్ టీం తరపున ఆడుతున్నాడు. అయితే బుధవారం జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో చమికా కరుణరత్నే గాయపడ్డాడు. గాల్లోకి లేచిన బాల్ ను క్యాచ్ పడుతుండగా, బాల్ అతనికి ముఖంపై తగిలింది. దీంతో నోటి నుంచి రక్తం వచ్చింది. 4 దంతాలు ఊడిపోయాయి. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని, ఆస్పత్రికి తీసుకెళ్లామని క్యాండీ ఫాల్కన్స్ టీం మేనేజ్ మెంట్ తెలిపింది.