పెరు దేశానికి తొలిసారిగా ఓ మహిళ అధ్యక్షురాలయ్యారు. అధ్యక్షుడు పెడ్రో కాస్టిల్లోను అభిశంసన ద్వారా తొలగించిన నేపథ్యంలో ఉపాధ్యక్షురాలిగా ఉన్న దినా బొలార్టే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. 60 ఏళ్ల దినా బొలార్టే జూలై 2026 వరకు తానే అధికారంలో ఉంటానని తెలిపారు. రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ఏకాభిప్రాయాన్ని కుదుర్చుకోవాలని, కొంత సమయం ఇస్తే దేశాన్ని కాపాడుతానని ఆమె తెలిపారు. అభిశంసన తర్వాత పెడ్రోను అరెస్టు చేశారు. మెక్సికో ఎంబసీకి వెళ్తున్న సమయంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.