టీమిండియాకు గాయాలబెడదపై కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. రోహిత్ గాయాన్ని సీరియస్‌గా తీసుకున్నామని, మూడో వన్డేలో అతడు ఆడటం లేదని స్పష్టం చేశాడు. ఆ తర్వాత జరిగే టెస్టు సిరీస్‌లో అయినా రోహిత్ ఆడతాడో లేదో ఇప్పుడే చెప్పలేమన్నాడు. అలాగే రెండో వన్డేలో గాయపడిన దీపక్ చాహర్ కూడా మూడో వన్డేకు అందుబాటులో ఉండటం లేదని ద్రావిద్ తెలిపాడు. తొలి వన్డేలో అరంగేట్రం చేసిన కుల్దీప్ సేన్ కూడా గాయం కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఈ ముగ్గురూ కూడా మూడో వన్డేలో ఆడటం లేదని ద్రావిడ్ కన్ఫర్మ్ చేశాడు. ఆటగాళ్ల గాయాలు జట్టుకు మంచిది కాదని అభిప్రాయపడ్డాడు. రోహిత్ లేకపోతే అతని స్థానంలో మూడో వన్డేలో జట్టుకు కేఎల్ రాహుల్ సారధ్యం వహిస్తాడు. ఓపెనర్‌గా మరోసారి విరాట్ కోహ్లీ వచ్చే అవకాశం ఉంది.