ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్ర విభజనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎప్పుడూ ఉమ్మడి రాష్ట్రానికే మద్దతిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం జగన్ ముందుంటారని తెలిపారు. కుదిరితే ఏపీ మళ్లీ కలవాలన్నదే తమ విధానమని, కానీ ఇప్పుడు అది సాధ్యమయ్యో పనేనా అంటూ అభిప్రాయపడ్డారు. విభజన హామీల అమలుకు ప్రయత్నించాలని ఆయన అన్నారు. ఉండవల్లి వ్యాఖ్యలు అసందర్భమని ఆయన వ్యాఖ్యానించారు.