పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్పూర్ రైల్వే స్టేషన్ లో బుధవారం ఊహించని ప్రమాదం జరిగింది. రైల్వే ప్లాట్ ఫాంపై ఉన్న ఓ టీటీఈకి కరెంట్ షాక్ తగిలింది. ప్లాట్ ఫాంపై ఇద్దరు టీటీఈలు మాట్లాడుకుంటున్నారు. ఒక పక్షి విడిచిపెట్టిన కరెంట్ వైరు తగిలి ఓ టీటీఈ కరెంట్ షాక్ కి గురయ్యాడు. కరెంట్ షాక్ తగిలిన వెంటనే రైలుపట్టాలపై పడిపోయాడు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. రైల్వే పోలీసులు తీవ్రంగా గాయపడిన టిటిఈ ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.