ప్రకాశం జిల్లా, దర్శిలో ఈనెల 15వ తేదీన సీఎం వైఎస్ జగన్‌పర్యటించనున్న సందర్భంగా దర్శి-కురిచేడు రోడ్డులోని శివరాజ్‌నగర్ వద్ద ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌ను ఎస్పీ మలికగర్గ్ పరిశీలించారు. సీఎం రాక సందర్భంగా భద్రతా, బందోబస్తు, బారికేడ్ల ఏర్పాట్లు, పార్కింగ్ ప్రదేశాల ఎంపిక, కాన్వాయ్ రూట్, రిసెప్షన్ ఏర్పాటు స్థలాన్ని ఎస్‌పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa