ప్రతి నెలలో ఒక రోజు ప్రత్యేకంగా దివ్యాంగుల కోసం పని చేస్తామని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ హామీ ఇచ్చారు. ప్రపంచ విభిన్న ప్రతిభా వంతుల దినోత్సవం బుధవారం పట్టణంలోని డీఎస్ఏ స్టేడియంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... విభిన్న ప్రతిభా వంతులు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు కృషి చేస్తామన్నారు. సమాజంలో అందరూ సమానమేనన్న భావన అందరిలో కలగాలన్నారు. త్వరలో వారికి ఇంటి నివేశన స్థలాలు, ఆధార్ కార్డు నమోదు కేంద్రాలు, సదరన్ క్యాంపులను ఏర్పాటు చేస్తామన్నారు.