శబరిమలకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులకు కేరళలోని వివిధ ప్రాంతాల్లో షెల్డర్లను ఏర్పాటు చేసినట్టు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోయ్ తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డికి బుధవారం రాసిన లేఖలో ఆయన ఈవిషయాన్ని పేర్కొన్నారు. మిడ్ వే షెల్డర్లల్లో తాగునీరు, అన్నదానం వంటి సౌకర్యాలు కల్పించినట్టు వెల్లడించారు. ఈ సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. మొత్తం 52 షెల్టర్లను ఏర్పాటుచేశారు.