ఏపీతో పాటు తమిళనాడులోని 9 జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాయలసీమ జిల్లాలు సహా ప్రకాశం జిల్లాకు మాండూస్ తుఫాను ప్రభావం ఉన్నట్టు ప్రకటించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తుపాను ప్రభావిత జిల్లాలకు సహాయక చర్యలు చేపట్టేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎపీడీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ఒంగోలు వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 65-85 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.