రాజస్థాన్‌లో గురువారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జోత్పూర్ జిల్లా భుంగ్రా గ్రామంలో వివాహ వేడుకలో ఐదు సిలిండర్లు పేలాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, 51 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఎక్కువ మంది మహిళలు మరియు పిల్లలు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారందరినీ జోధ్‌పూర్‌లోని మహాత్మా గాంధీ ఆసుపత్రికి తరలించారు.