ఉత్తరాఖండ్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. గురువారం సాయంత్రం బాగేశ్వర్ రమాది సమీపంలో కారు కాలువలో పడి నలుగురు మృతి చెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో ఇద్దరికి గాయాలు కాగా, స్థానికులు, పోలీసులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ధార్వాన్ సింగ్ అనే వ్యక్తి తన కుటుంబంతో సహా పితోర్‌ఘర్ జిల్లాలోని హోక్రా ఆలయంలో సామూహిక పూజలు చేసిన తర్వాత గురువారం తన స్వగ్రామమైన షామా (కప్ కోట్)కి తిరిగి వచ్చాడు. ఈ క్రమంలో కారు అదుపు తప్పి కాలువలో పడిపోయింది.