ఏపీలోని ప్రకాశం జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దొనకొండ మండలంలోని రుద్రసముద్రంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. బైక్ ను ఢీకొట్టి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతులను శివరాంపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa