రకరకాల నెయిల్ పాలిష్‌లను, రకరకాల స్టైల్స్‌లో వేసుకోవడానికి నేటి తరం అమ్మాయిలు ఇష్టపడుతున్నారు. అయితే నెయిల్‌పాలిష్‌ల వల్ల గోర్ల సహజత్వం కోల్పోవటమే కాక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. నెయిల్ పాలిష్‌లను ఫార్మాల్డిహైడ్ అనే కెమికల్‌తో తయారు చేస్తారు. దీనివల్ల స్కిన్ ఇన్ఫెక్షన్ వంటి తీవ్రమైన వ్యాధుల బారిన పడవచ్చు. అలాగే ఈ రసాయనం జీర్ణక్రియ వ్యవస్థ, రోగనిరోధకతపై ప్రభావం చూపుతుంది. నెయిల్ పాలిష్‌లను ఎక్కువగా ఉపయోగించే మహిళల్లో ట్రిఫెనైల్ ఫాస్ఫేట్ అనే విషపూరిత పదార్థం ఉన్నట్లు కనుగొన్నారు. నెయిల్ పాలిష్‌లోని టొల్యూన్ మూలకం పాలిచ్చే మహిళల నుండి చిన్నపిల్లలకు చేరుతుంది. ఇది భవిష్యత్తులో పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.