బంగాళాఖాతంలో ఏర్పడిన మాండుస్ తుఫాన్ తీవ్ర తుఫాన్ మారింది. తుఫాను తీరం దాటిన తర్వాత 2 రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తుఫాన్ ప్రభావంతో తిరుపతిలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముంపు ప్రాంత బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి ఆదేశించారు. ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్ 0877 2256766 ఏర్పాటు చేశారు. మరోవైపు తుఫాన్ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో నేటి మధ్యాహ్నం స్కూళ్లు, కాలేజీలకు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ సెలవు ప్రకటించారు.