పులివెందులలో అభివృద్ధి పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. పులివెందులపట్టణంలో ఆర్అండ్ బి అతిథి గృహంలో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. పులివెందుల రింగ్ రోడ్డు పరిధిలో విగ్రహాల ఏర్పాటుకు సంబంధించి కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ఈ ఖర్చును ఇటీవల ఉల్లి పంటతో నష్టపోయిన రైతులకు ఉపయోగపడేలా చేసి ఉంటే బాగుండేదన్నారు. ఈనెల 3న ముఖ్యమంత్రి జగన్ పులివెందుల పర్యటనలో ఎసిఎస్ఆర్ కళ్యాణ మండపంలో వివాహానికి హాజరయ్యారు. ఆ సందర్భంగా తారు రోడ్డు వేశారని, ఇది ప్రయివేట్ కార్యక్రమానికి తారురోడ్డు వేయడం విడ్డూరమన్నారు. అలాగే పశ్చిమ రాయలసీమ పట్టబద్రుల ఎమ్మెల్సీ తరఫున టిడిపి బలపరుస్తున్న బి రాంగోపాల్ రెడ్డికి గ్రాడ్యుయేట్లు మద్దతివ్వాలన్నారు. అనంతరం పులివెందుల మండల పరిధిలోని అచ్చువెల్లి గ్రామంలో మన రాష్ట్రానికి ఇదేమి కర్మ అనే కార్యక్రమంలో రవి పాల్గొన్నారు. కార్యక్రమంలోటిడిపి పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ రెడ్డి, పట్టణ మాజీ అధ్యక్షుడు మద్దూరు వెంకట్రామిరెడ్డి, సింహాద్రిపురం మండల నాయకులు జోగిరెడ్డి, ఆక్కుల గారి విజయకుమార్ రెడ్డి, పనిల్, మల్లికార్జున్రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.