భార్యను చంపిన కేసులో భర్తకు జీవితకాల శిక్షను మహారాష్ట్రలోని థానే కోర్టు విధించింది. వివరాల్లోకి వెళ్తే 63 ఏళ్ల హీరాలాల్ భార్యా, పిల్లలతో కలిసి జీవించేవాడు. భార్యభర్తల మధ్య తరచుగా ఆర్థిక అంశాలపై గొడవలు జరిగేవి. దీంతో అక్టోబర్ 13, 2015న కూడా గొడవ జరగడంతో హీరాలాల్ భార్యను ఇనుప రాడ్డుతో కొట్టిచంపాడు. ఈ కేసులో థానే అదనపు సెన్స్ జడ్జి నిందితుడు హీరాలాల్ మాలికి జీవితకాల శిక్షతో పాటు 5వేల జరిమానా విధించారు.