తమిళనాడు సంప్రదాయ క్రీడ ‘జల్లికట్టు’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జల్లికట్టులో హింస ఉంటుందని, అంత మాత్రానా దాన్ని నెత్తుటి క్రీడ అనలేమని పేర్కొంది. ఈ క్రీడలో రక్తం చిందడం యాదృచ్ఛికం మాత్రమేనని, అంతే తప్ప నెత్తురు కళ్ల చూడాలన్న ఉద్దేశంతో ఆ కార్యక్రమంలో ఎవరూ పాల్గొనరని తెలిపింది. జల్లికట్టుకు అనుమతిస్తూ 2017లో ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ టు యానిమల్స్ చట్టానికి తమిళనాడు సవరణ చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం విచారిస్తోంది. ఈక్రమంలో పిటిషనర్ల తరఫున న్యాయవాది శ్యామ్ దివాన్, జల్లికట్టును నెత్తుటి క్రీడగా అభివర్ణించగా కోర్టు పైవిధంగా స్పందించింది. ఇక తన తీర్పును రిజర్వులో ఉంచుతున్నట్లు సుప్రీంకోర్టు గురువారం ప్రకటించింది.