అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉదయం సెన్సెక్స్ 43 పాయింట్ల లాభంతో 62,613 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 18,628 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.24 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, సన్‌ఫార్మా, HUL, NTPC, SBI, నెస్లే ఇండియా, మారుతీ, ITC, డాక్టర్ రెడ్డీస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. HCL టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, TCS, యాక్సిస్ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.