ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుఫాను తీవ్ర తుఫానుగా మారింది. ఈ నేపథ్యంలో తమిళనాడులో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. కావేరి డెల్టా ప్రాంతంలోని నాగపట్నం, తంజావూరు, చెన్నై, దాని మూడు పొరుగు జిల్లాలు, కడలూరుతో సహా 10 జిల్లాల్లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, స్టేట్ ఫోర్స్ నుండి దాదాపు 400 మంది సిబ్బందితో కూడిన 12 బృందాలను మోహరించినట్లు తమిళనాడు ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై నుంచి వెళ్ళే 15 విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇప్పటికే తమిళనాడు లోతట్టు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి తేలికపాటి వర్షం మొదలైంది.