వ్యవసాయ రంగం మాదిరిగానే ఆక్వా ఉత్పాదనలకు కనీస మద్ధతు ధర, ఇన్పుట్ సబ్సిడీ కల్పించి ఆక్వా రైతులను ఆదుకోవాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆక్వా ఉత్పాదన నిల్వలు వృథా కాకుండా స్టోరేజి సౌకర్యాలను మరింతగా మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని రాజ్యసభలో గురువారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఆయన కేంద్రప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా దేశంలో ఆక్వా రైతాంగం ఎదుర్కొంటున్న పరిస్థితులను ఆయన వివరించారు.