వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జయహో బీసీ మహాసభ సక్సెస్ను చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నాడని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు బీసీల గురించి ఏరోజైనా ఆలోచన చేశాడా..? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఏ విషయంలోనూ ప్రజలకు అండగా నిలవలేదని చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నిలబెట్టుకోలేకపోయాడన్నారు. చంద్రబాబు మాటలు తప్ప చేతలు లేవన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ విలేకరుల సమావేశం నిర్వహించారు.