ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో 5 ఏళ్ల చిన్నారిని లైంగికంగా వేధించాడు 19 ఏళ్ల మహ్మద్ అక్తర్ హుస్సేన్. ఈ ఘటన మహారాష్ట్ర రాయ్‌గఢ్‌లోని తలోజాలో జరిగింది. ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్న నిందితుడు చిన్నారి పక్క ఫ్లాట్‌కు వెళ్తుండగా ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత చిన్నారి వాంతులు చేసుకుంది. ఏమైందని తల్లి అడగడంతో విషయం చెప్పింది. దీంతో పొరుగువారితో కలిసి నిందితుడు తప్పించుకోకుండా బయట కాపలా ఉండి చిన్నారి అతడిని గుర్తించిన తర్వాత పోలీసులకు అప్పగించారు.