ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముస్లింలకు ఆ పథకాలు టీడీపీ అమలు చేస్తే.. వైసీపీ రద్దు చేసింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 09, 2022, 03:22 PM

పొన్నూరులో మైనార్టీల ఆత్మీయ సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చిన ప్రభుత్వం తమదని చంద్రబాబు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీలో మతకలహాలు రూపు మాపింది టీడీపీ ప్రభుత్వం అని వ్యాఖ్యానించారు. ముస్లిం పిల్లల వివాహాలకు దుల్హన్ ద్వారా ఆర్థికసాయం చేశామన్న చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వం ఈ పథకాలన్నీ రద్దు చేసిందని మండిపడ్డారు. దుల్హన్ పథకానికి అడ్డగోలు నిబంధనలు పెట్టి దూరం చేసిందని. తాము అధికారంలోకి వచ్చాక దుల్హన్ పథకం మళ్లీ అమలు చేస్తామని పేర్కొన్నారు. మైనార్టీ పిల్లలకు విదేశీ విద్యా దీవెన అమలు చేశామన్న బాబు. ప్రపంచంలో మంచి వర్శిటీలో చదువుకునే అవకాశం కల్పించామన్నారు. పోటీ ప్రపంచంలో వారు నిలబడేలా అండగా ఉన్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com