నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఖాకీ: ది బీహార్ చాప్టర్’ అనే వెబ్ సిరీస్ తో సంచలనంగా మారిన ఐపీఎస్ అధికారి అమిత్ లోధా అవినీతి ఆరోపణల్లో చిక్కుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారనే ఆరోపణలతో కేసు నమోదు కాగా అధికారులు ఆయన్ను సస్పెండ్ చేశారు. బీహార్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అశోక్ మహతోను అరెస్ట్ చేసిన ఐపీఎస్ అమిత్ లోధా పుస్తకం ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ కోసం నెట్ ఫ్లిక్స్ తో రూ.కోటి డీల్ చేసుకోగా, అతని భార్య ఖాతాలో రూ.48 లక్షలు జమైనట్లు గుర్తించారు.