దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధావాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్ కుటుంబసభ్యుల పేర్లు కూడా ఛార్జ్‌షీట్‌లో ఉండాలని శ్రద్ధా తండ్రి తరఫు లాయర్ సీమా ఖుష్వాహ అన్నారు. డేటింగ్ యాప్స్ వాడే హక్కు అందరికీ ఉంది. అయితే వీటిపై నియంత్రణ అవసరం. వాటిల్లో నేరస్థులు, ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉంది. ఛార్జ్‌షీట్‌లో అఫ్తాబ్ కుటుంబసభ్యుల పేర్లు కూడా చేర్చాలని నా భావన. అని సీమా పేర్కొన్నారు. ప్రస్తుతం తీహాడ్ జైల్లో ఉన్న అఫ్తాబ్ జుడీషియల్ కస్టడీని దిల్లీలోని స్థానిక కోర్టు మరో 14 రోజులు పొడిగించింది.