గత నెలలో వాహన రిటైల్ అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయని వాహన డీలర్ల పరిశ్రమ సమాఖ్య ఫాడా తెలిపింది. ప్రయాణికుల, ద్విచక్ర, వాణిజ్య వాహనాలు ఇలా అన్ని విభాగాల్లో అమ్మకాలు జోరందుకున్నాయని పేర్కొంది. నవంబరులో మొత్తం ఆటోమెుబైల్ విక్రయాలు 26% పుంజుకున్నాయని తెలిపింది. క్రితం ఏడాది ఇదే నెలలో 18,93,647 యూనిట్లు అమ్ముడుపోగా.. ఈసారి అది 23,80,465 యూనిట్లకు చేరినట్లు వెల్లడించింది. పండగ సీజన్ ముగిసినప్పటికీ విక్రయాలు భారీ ఎత్తున కొనసాగాయని ఫాడా అధ్యక్షుడు మనీశ్రాజ్ సింఘానియా పేర్కొన్నారు.