మిగిలిపోయిన ఆహారాన్ని పడేయటం ఎందుకని చాలామంది వాటిని వేడి చేసుకుని తింటూ ఉంటారు. అయితే ఇలా తినటం వల్ల అనేక అనారోగ్యాలు చుట్టుముడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా బంగాళదుంపలతో చేసిన ఆహారాన్ని మళ్లీ వేడి చేయకండి. ఒకసారి వాడిన తర్వాత బంగాళదుంపల్ని మళ్లీ వేడి చేయడం వలన అది విషపూరితమవుతుంది. అన్నం, చికెన్, గుడ్లు కూడా తిరిగి వేడి చేయకూడదు. ఇటువంటి ఆహారాన్ని వేడి చేసుకుని తినటం వల్ల ఆరోగ్యం నాశనమవుతుంది.