బంగాళాఖాతంలో ఏర్పడిన మాండౌస్ తుపాను తీరానికి చేరువవుతుండడంతో ఏపీపై ప్రభావం పెరుగుతోంది. నెల్లూరు జిల్లా మైపాడు బీచ్‌లో అలలు ఎగసిపడుతున్నాయి. ఇక్కడ సముద్రం 50 మీటర్ల ముందుకు వస్తుంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న నేపథ్యంలో గాలుల తీవ్రత పెరిగిన నేపథ్యంలో మైపాడు బీచ్‌కు పర్యాటకులు రాకుండా పోలీసులు చర్యలు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి నెల్లూరు జిల్లాలోని కోస్తాలో వర్షాలు కురుస్తున్నాయి.