ఇటీవల కోర్టులకు వింత వింత కేసులు వస్తున్నాయి. తాాజాగా అలాాాాాాంటి కేసుపై కోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అంతేకాకుండా పిటిషనర్ కు జరిమాన వధించింది. యూట్యూబ్‌లో అసభ్యకరమైన కంటెంట్ కారణంగా తన ఏకాగ్రత దెబ్బతిని పోటీ పరీక్షల్లో విజయం సాధించలేకపోయాని, ఇందుకు గూగుల్ ఇండియా తనకు రూ. 75 లక్షల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అశ్లీల ప్రకటనల కారణంగా తన దృష్టి వాటిపై మళ్లి, ఏకాగ్రత కోల్పోయి తాను పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేకపోయానని మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాల ధర్మాసనం తిరస్కరించింది. ఈ సందర్భంగా యువకుడిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడి చర్యలు దారుణంగా ఉన్నాయని పేర్కొంటూ రూ.25,000 జరిమానా విధించింది.
‘‘మీరు ఇంటర్నెట్‌లో ప్రకటనలను చూసినందున మీకు నష్టపరిహారం కావాలి.. వాటి కారణంగా మీ ఏకాగ్రత కోల్పోయి పరీక్షలో ఉత్తీర్ణత కాలేకపోయారా?’ అని పిటిషనర్ తరఫు లాయర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం ఇది అత్యంత దారుణమైన పిటిషన్లలో ఒకటి.. ఇటువంటి వ్యాజ్యాలు న్యాయవ్యవస్థ సమయాన్ని పూర్తిగా వృథా చేస్తాయి’ ధర్మాసనం మండిపడింది. పరిహారంతో పాటు అశ్లీలతను సోషల్ మీడియా వేదికల్లో నిషేధించాలని పిటిషనర్ కోరాడు.
పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న తాను పాఠ్యాంశాల కోసం యూట్యూబ్‌లో సబ్‌స్రైబ్ చేసుకున్నానని చెప్పాడు. అందులో అసభ్యకరమైన కంటెంట్‌తో కూడిన ప్రకటనలను చూసినట్లు ధర్మాసనానికి తెలియజేశాడు. ‘‘మీకు ప్రకటన నచ్చకపోతే, చూడకండి.. ఎందుకు ప్రకటనలను చూడటానికి ఆసక్తి ప్రదర్శించాడు’’ అని నిలదీసింది.
తొలుత పిటిషన్‌ను కొట్టివేస్తూ పిటిషనర్‌కు రూ. లక్ష జరిమాన విధించింది. తరువాత హిందీలో వాదించిన పిటిషనర్ తనను క్షమించి, జరిమానాను రద్దుచేయాలని సుప్రీంకోర్టును కోరారు. తాను కూడా నిరుద్యోగినని విన్నవించుకున్నాడు. దీంతో అతడికి కొంచెం ఊరట కలిగించేలా జరిమానాను రూ.లక్ష నుంచి రూ.25 వేలకు తగ్గించింది. కేవలం ప్రచారం కోసమే ఇలాంటి పిటిషన్లు వేయలేరని, భవిష్యత్తులో మరోసారి ఇలా చేయొద్దని మందలించింది.