రష్యా నుంచి చమురు ధర విషయంలో తగ్గింపు లభించిందని పాక్ గొప్పగా చెప్పుకుంటున్న వేళ పుతిన్ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. భారత్‌కి చమురు ధర తగ్గింపు ఇచ్చినట్లుగా పాకిస్థాన్‌కు ఇచ్చేదే లేదని కరాఖండీగా చెప్పేసింది రష్యా. ఈ మేరకు రష్యా అధికారులు, పాక్ ప్రతినిధులు ముసాద్ మాలిక్, మంత్రి(పెట్రోలియం విభాగం), కెప్టెన్ ముహ్మద్ మహమూద్ పెట్రోలియం కార్యదర్శిలతో ఇటీవల మాస్కోలో జరిగిన సమావేశంలో రష్యా ఈ విషయాన్ని స్పష్టం చేసింది. అంతేగాదు రష్యా-పాక్ మధ్య ప్రతిపాదిత చమురు పైప్‌లైన్ ప్రాజెక్ట్‌పై కూడా రష్యా పెద్దగా ఆసక్తి చూపలేదు.