మాండూస్ తుఫాను తీరం దాటిన నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దు అని జిల్లా శనివారము కలెక్టర్ బసంత్ కుమార్ తెలిపారు. పుట్టపర్తి జిల్లాలో నేటి నుంచి 2 రోజుల పాటు అధిక వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ సూచించడంతో ముందు జాగ్రత్త చర్యగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ముందుస్తు చర్యలతో ప్రజలను అప్రమత్తం చేయడానికి జిల్లా కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. 08555292432, 9154968578 నెంబర్లకు డయల్ చేసి జిల్లా వాసులు కంట్రోల్ రూమ్ సేవలు పొందవచ్చని, 24 గంటలు షిఫ్ట్ పద్ధతిలో సిబ్బందిని నియమించామని పై ప్రకటనలో తెలిపారు. డివిజన్ కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయునట్లు తెలిపారు.