గుంతకల్లు పట్టణంలోని శస్త్ర జూని యర్ కళాశాలలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యం లో శనివారం అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానవ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బిఎస్. కృష్ణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎలాంటి వివక్ష లేకుం డా తమ హక్కులను పొందడం కోసం 1993లో భారత ప్రభుత్వం చట్టం తీసుకువచ్చిందన్నారు. ఈ చట్టం పరిధిలో1993 అక్టోబర్ 12న జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పడిందన్నారు. మన హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటుం దని అన్నారు. ఈ కార్యక్రమంలో అనంత పురం జిల్లా అధ్యక్షులు వై. రాజశేఖర్ రెడ్డి, కార్మిక ఐక్యవేదిక ఉమ్మడి జిల్లా ల అధ్యక్షులు టిజి. సురేష్, న్యాయ వాది నాగరాజు, కళాశాల ప్రిన్సిపల్ రమణ, వైస్ ప్రిన్సిపల్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.