ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కే వెంకటేశ్వరరావు పలు షాప్ లను తనిఖీ చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల నిషేధం అమలులో భాగంగా పట్టణంలోని షాపులను పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నిషేధిత జీరో మైక్రాన్ ప్లాస్టిక్ కవర్లను ఎవరు వాడకూడదని ఎవరైనా వాడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా నిషేధిత కవర్లు వాడితే 10, 000 వరకు పెనాల్టీ విధిస్తామని అన్నారు. సింగిల్ ఈజ్ ప్లాస్టిక్ వల్ల జరిగే అనర్ధాలు వ్యాపారస్తులు వినియోగదారులకు తెలిపి కేవలం గుడ్డ సంచులు లేదా భూమిలో సులువుగా కరిగిపోయే సంచులను మాత్రమే వాడుకునే విధంగా ప్రజలను సంసిద్ధం చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.