డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 7 అర్ధరాత్రి అపహరించిన అంబేద్కర్ విగ్రహాన్ని తమకు అప్పజెప్పాలని అన్నమయ్య జిల్లా ప్రజా సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం జోరుగా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజాసంఘాల నేతలు అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించిన స్థానంలో ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిబిరంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాయచోటి ఎమ్మెల్యే ఆదేశాల మేరకు అంబేద్కర్ విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో తొలగించిన తర్వాత ఎమ్మెల్యే ఆదేశాలతోనే రెవెన్యూ అధికారులు ధ్వంసం చేసినట్లు ప్రజాసంఘాల నాయకులు అనుమానం వ్యక్తం చేశారు.
ఎమ్మార్వో కార్యాలయ ఆవరణంలో ఉన్న అరసెంట్ జాగాలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి అనుమతి లేనందునే రాయచోటి తాసిల్దార్ విగ్రహాన్ని తొలగించాడని స్వయానా రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రకటించారని అయితే ఇప్పటివరకు రాయచోటి తాసిల్దార్ ఆ విషయాన్ని బహిర్గతం చేయలేదని ప్రజాసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. అనుమతి లేనందుని అధికారులు తొలగించారని, ఎమ్మెల్యే ప్రకటించడం ఇందుకు రెవెన్యూ అధికారులు మౌనం పాటిస్తుండడం విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లుగా మాకు అనుమానం కలుగుతుందని, ఒకవేళ మీరు ఆ నేరం చేయని పక్షంలో ఆ విగ్రహాన్ని తమకు అప్పజెప్పాలని వారు డిమాండ్ చేశారు.
అనుమతి లేకుండా విగ్రహం ఏర్పాటు జరిగినప్పటికీ దానిని అర్ధరాత్రి సమయంలో అధికారులు దొంగ చాటుగా ఆ మహానుభావుడు విగ్రహం తొలగించాల్సిన అగత్యం ఏమిటని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే మరియు అధికారుల ప్రవర్తన పై తమకు అనుమానం ఉందని విగ్రహం ఏమైందో కూడా మాకు ఆందోళనగా ఉందని ఆ విగ్రహాన్ని వెంటనే తమకు అప్పజెప్పాలని లేనిపక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు హెచ్చరించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి అనుమతి ఉందా లేదా అనేది సమస్య కాదని, జాతీయ నాయకుడి విగ్రహం కాబట్టి దేశంలో ఏ వ్యక్తి అయినా అలాంటి జాతీయ నాయకుల విగ్రహాలను అవమానపరచకూడదని అవమానం చేసినట్లయితే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం నేరస్థులవుతారని వారన్నారు.
ఈ విషయాలన్నీ తెలిసి కూడా రాయచోటి ఎమ్మెల్యే స్వయానా తాసిల్దార్ పై ఒత్తిడి చేసి అర్ధరాత్రి సమయంలో విగ్రహాన్ని తొలగించి దానిని ధ్వంసం చేశారని మాకు అనుమానంగా ఉందని అదే జరిగి ఉంటే ఇందులో రాయచోటి ఎమ్మెల్యే ప్రధాన ముద్దాయి ఎమ్మెల్యే అదే పాటించిన అధికారులు తర్వాతి స్థానంలో ఉంటారని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల జేఏసీ నాయకులు ఈశ్వర్, రామాంజనేయులు, రెడ్డయ్య తాతయ్య, రవిశంకర్, నాగార్జున, రామా శ్రీనివాసులు, అక్బర్ అలీ, మూగళ్ల రెడ్డయ్య, సుజాత, ఆంజనేయులు పాల్గొన్నారు.