మాండుస్ తుఫాను వల్ల రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆచార్య రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారు రైతులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడంతో పాటు పంటలపై జాగ్రత్తలు పాటించే విధంగా రైతులకు అవగాహన కొరకు కొన్ని సూచనలు ఇవ్వడం జరిగిందని చెన్నూరు మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి తెలిపారు. శనివారం ఆమె స్థానిక రైతు భరోసా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ రైతులు మాండుస్ తుఫాను వలన వివిధ పంటలపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలిపారు.
వరి నారు వేసిన రైతులు: - వరి నారులో మురుగు నీటిని బయటకు పోయే విధంగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అలాగే ప్రధావ పొలంలో నాటి షాకియో ఉత్పత్తి దశలో ఉన్న వరికి అదనపు నీటిని బయటకు పంపించి వర్షం ఆగిన తర్వాత 15 కిలోలు యూరియా పై పాటుగా వేయాలని సూచించారు.
వేరుశనగ: - పంటకు సంబంధించి అధిక తేమ వలన వచ్చు ఇనుప దాతు లోపరీ నివారణకు ఒక కిలో అన్న బే వి అలాగే 200 గ్రాములు నిమ్మ ఉప్పు 2 వందల లీటర్ల నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలన్నారు.
పత్తి పంట: - వర్షం తగ్గిన తర్వాత వీలైనంత త్వరగా నీటిని బయటకు పంపించి, వేరు కుళ్ళు నివారణకు కాపర్ ఆక్సి క్లోరైడ్ 3గ్రాములు ఒక లీటర్ నీటితో కలిపి ఆశించిన మొక్క చుట్టు పోయాలని తెలిపారు. శనగ పంట కు సంబంధించి వర్షం తగ్గిన తర్వాత మొదలు కుళ్ళు నివారణకు ఎకరాకు 200 గ్రాముల కార్పెండిజం మొక్కల మొదలుభాగం తడిచేటట్లు పిచికారి చేయాలన్నారు.
మినుము పట్టకు సంబంధించి వర్షం కారణంగా అధిక తేమ వలన ఆకులు పసుపు వర్ణంలోకి మారిపోయినట్లయితే అన్న బెవి ఐదు గ్రాములు అలాగే నిమ్మ ఉప్పు0. 5 గ్రాములు లీటర్ నీటిలో కలిపి చేయాలని తెలిపారు. అలాగే రైతులు నీరు పొలంలో లేకుండా గట్లను తెగ్గొట్టి మురుగు నీటిని కాలువల ద్వారా వెళ్లేటట్లు చూడాలని రైతులు పై విధానాలు పాటించినట్లయితే పంటలకు ఎలాంటి ముప్పు వాటిల్లదని ఆమె తెలియజేశారు.