తీవ్ర మల్లగుల్లాల అనంతరం హిమాచల్‌ప్రదేశ్ సీఎంగా సుఖ్వీందర్సింగ్ సుఖును కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. గత అసెంబ్లీలో విపక్ష నేతగా కొనసాగిన ముకేశ్ అగ్నిహోత్రి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆదివారం ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ఆయనతో పాటు రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీ వాధ్రా తదితరులు ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 68 స్థానాలకు గాను కాంగ్రెస్ 40 సీట్లు గెలిచి స్పష్టమైన మెజారిటీ సాధించిన తెలిసిందే.