ఓ మహిళతో అత్యంత సన్నిహితంగా ఉండడాన్ని తన కుమారుడు చూశాడనే కారణంతో ఓ తండ్రి బాలుడిని దారుణంగా హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాలో జరిగింది. బాన్ గర్డాకి చెందిన 45 ఏళ్ల వ్యక్తికి సమీప బంధువైన ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఇటీవల ఆమెతో సన్నిహితంగా ఉన్న సమయంలో.. అతని 15 ఏళ్ల కుమారుడు చూశాడు. దీంతో ఆ తండ్రి బాలుడి చేతులు నరికేసి, ఆపై ఉరేసి హతమార్చాడు. చేతులను బావిలో వేసి మృతదేహాన్ని పొదల్లో పడేశాడు. బాలుడి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా విచారణ అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు.