బర్త్ డే వేడుకల్లో ఓ టీనేజర్ తన స్నేహితురాలిని ముద్దు పెట్టుకుంటూ సెల్ఫీ తీసుకున్నాడు. దాన్ని చూపించి ఆ 17 ఏళ్ల యువతిని బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ముంబైలో జరిగింది. నిందితుడు బాధితురాలి కళాశాలకు వెళ్లి బెదిరిస్తుండగా తోటి విద్యార్థులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. అనంతరం పోలీసులను ఆశ్రయించగా పోక్సో చట్టం ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.