ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రంలో అట్టడుగు స్థానంలో నిలిచింది. 2021-22 లో రాష్ట్రంలో తలసరి ఆదాయం 1.26 లక్షలుగా నమోదైంది. 2021-22 ఏడాదికి గాను రూ1.68 లక్షల తలసరి ఆదాయంతో కర్ణాటక మొదటి స్థానంలో నిలవగా, తెలంగాణ 1.58 లక్షలతో రెండో స్థానం, తమిళనాడు రూ.1.54 లక్షలు, పుదుచ్చేరి రూ.1.50లక్షలు, కేరళ రూ.1.43 లక్షలు, రూ. 1.26 లక్షలతో ఏపీ చివర స్థానంలో ఉంది. కాగా, 2021-22 సంవత్సరానికి రాష్ట్ర నికర స్థూల ఉత్పత్తి రూ.6.61 లక్షల కోట్లుగా నమోదైంది.