బ్యాంక్ ఆఫ్ బరోడా వినియోగదారులకు మరోసారి షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును పెంచాలని నిర్ణయించింది. అన్ని రకాల టెన్యూర్స్ పై 30 బేసిస్ పాయింట్లను పెంచనుంది. పెంచిన పాయింట్లు ఈ నెల 12 నుండి అమల్లోకి రానున్నాయి. కాగా, బ్యాంకే ఆఫ్ బరోడా నవంబర్ లోనే 15 బేసిస్ పాయింట్లు పెంచింది. తాజాగా మరోసారి 30 బేసిస్ పాయింట్లు పెంచనుంది. దీని ఫలితంగా గృహ, వ్యక్తిగత రుణాలతో పాటు చిన్న, మధ్య తరహా సంస్థలకిచ్చే రుణాలపైనా వడ్డీరేట్లు పెరగనున్నట్లు సమాచారం.