యూపీ మధురలో హోలీ గేట్ కు చెందిన తుంగనాథ్ చతుర్వేది అనే న్యాయవాది 2001లో తన సహచరుడితో కలిసి మొరాదాబాద్ వెళ్లాల్సి వచ్చింది. డిసెంబర్ 25న ఈశాన్య రైల్వే జోన్ లో 2 టికెట్లు తీసుకుని రూ.100 ఇచ్చాడు. అయితే క్లర్క్ రూ.35 టికెట్ కు రూ.70 బదులు రూ.90 తీసుకున్నాడు. దీనిపై తుంగనాథ్ మథుర జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించాడు. 21 ఏళ్లు ఈ కేసు సాగి ఈ ఏడాది ఆగస్ట్ 5న తీర్పు వెలువడింది. తుంగనాథ్ కు రూ.20 చెల్లించాలని మానసికంగా ఇబ్బంది పెట్టినందుకు మరో రూ.15 వేలు చెల్లించాలని ఫోరం ఈశాన్య రైల్వే జోన్ ను ఆదేశించింది.