తెలుగుదేశం శ్రేణులకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్య విజ్ఞప్తి చేశారు. మాండూస్ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలిచి, సహాయం అందించాలని పిలుపునిచ్చారు. భారీ వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ధాన్యం, ఇతర పంటలను రైతులు కాపాడుకునేలా ప్రభుత్వం సహకారం అందించాలని సూచించారు. అంతేకాకుండా, రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు