బంగ్లాదేశ్ జాతీయ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో అక్కడి ప్రతిపక్షాలు అధికార పార్టీపై విరుచుకు పడుతున్నాయి. శనివారం రాజధాని ఢాకాలో ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ఆధ్వర్యంలో విపక్షాలు భారీ ర్యాలీ చేశాయి. వారం రోజులుగా బీఎన్ పీ పెద్ద ఎత్తున కార్యకర్తలు, సానుభూతి పరులను కూడగట్టి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించింది. వారం క్రితం జరిగిన ర్యాలీ హింసాత్మకంగా మారి ఓ వ్యక్తి మృతి చెందాడు. డిజిటల్ భద్రతా చట్టాన్ని వెనక్కి తీసుకోవడం, విద్యుత్, ఇంధనం, నిత్యావసర ధరల తగ్గింపు వంటి డిమాండ్లతో బీఎన్ పీ ఆందోళనలు చేస్తోంది.