అస్సాంలోని మోరిగావ్ గ్రామంలో బ్రహ్మపుత్ర నది కారణంగా ఇళ్లు, వ్యవసాయ భూములు కోతకు గురితావడంతో గ్రామస్తులు నిరాశ్రయులయ్యారు. దాదాపు 40-50 ఇళ్లు కోతకు గురై ధ్వంసం అయ్యాయి. బాధిత ప్రజలంతా తాత్కాలిక గుడారాలలో తలదాచుకుంటున్నారు. కోత కారణంగా భూమి, ఇళ్లు తుడిచిపెట్టుకుపోయాయని, ఈ శీతాకాలంలో ఉండడానికి సరైన స్థలం కూడా లేదని, తమ జీవితాలు చాలా విషాదకరంగా మారాయని మోరిగావ్ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.