ఆరు రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో Election Commission of India నిర్వహించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు సంబంధించిన గణాంకాలను ఎన్నికల కమిషన్ శనివారం వెల్లడించింది.ఈ సవరణలో భాగంగా అనర్హతగా గుర్తించిన పెద్ద సంఖ్యలో ఓటర్ల పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి.తాజా జాబితా ప్రకారం, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల కంటే Gujaratలోనే అత్యధికంగా ఓటర్ల తొలగింపులు నమోదయ్యాయి. మొత్తం 68,12,711 మంది పేర్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. ఎస్ఐఆర్కు ముందు రాష్ట్రంలో 5,08,43,436 మంది ఓటర్లు ఉండగా, సవరణ అనంతరం ఈ సంఖ్య 4,40,30,725కు తగ్గింది.అలాగే Madhya Pradeshలో 34,25,078 మంది పేర్లు తొలగించడంతో ఓటర్ల మొత్తం సంఖ్య 5,74,06,143 నుంచి 5,39,81,065కు తగ్గింది.ఇతర రాష్ట్రాల్లోనూ ఓటర్ల జాబితాల్లో గణనీయమైన మార్పులు నమోదయ్యాయి. Rajasthanలో ఓటర్ల సంఖ్య 5,46,56,215 నుంచి 5,15,19,929కు తగ్గింది. Chhattisgarhలో 2,12,30,737 నుంచి 1,87,30,914కు పడిపోయింది. Keralaలో 2,78,50,855 నుంచి 2,69,53,644కు తగ్గుదల కనిపించింది. Goaలో 11,85,034 నుంచి 10,57,566కు ఓటర్ల సంఖ్య తగ్గింది.కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వస్తే, Andaman and Nicobar Islandsలో 52,364 మంది పేర్లు తొలగించడంతో మొత్తం ఓటర్ల సంఖ్య 3,10,404 నుంచి 2,58,040కు తగ్గింది. Puducherryలో 10,21,578 నుంచి 9,44,211కు తగ్గగా, Lakshadweepలో 57,813 నుంచి 57,607కు స్వల్పంగా తగ్గింది.ఓటర్ల మరణాలు, శాశ్వత నివాస మార్పులు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదు, ఇతర అనర్హత కారణాల వల్ల ఈ తొలగింపులు జరిగాయని Election Commission of India స్పష్టం చేసింది. అదే సమయంలో అర్హత కలిగిన కొత్త ఓటర్లను జాబితాలో చేర్చినట్టు వెల్లడించింది. ఎన్నికల జాబితా నవీకరణ నిరంతర ప్రక్రియ అని, అర్హులైన పౌరులు కొత్తగా దరఖాస్తు చేసుకోవడం లేదా తమ వివరాల్లో సవరణలు చేసుకోవచ్చని ఈసీ తెలిపింది.ఇదిలా ఉండగా, పిల్లలపై లైంగిక వేధింపుల కేసులో అవిముక్తేశ్వరానంద స్వామిపై ఎఫ్ఐఆర్ నమోదైంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa