విశాక పూర్ణామార్కెట్ కు చెందిన మణికుమార్ స్థానికంగా 9 స్టార్ ఎంటర్ ప్రైజెస్ రైస్, ఆయిల్ హోల్ సేల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. నెలకు రూ.500 చెల్లిస్తే ఏడాదికయ్యే 6 వేలకు ఇంకో రెండు వేలు కలిపి 8వేల విలువైన సరుకులను ఇచ్చేవాడు. ఈ చీటీలో వందలాది మంది చేరారు. కాగా, ఇటీవల సరుకులు సమయానికి ఇవ్వకపోవడంతో కొందరు సభ్యత్వాన్ని విరమించుకొని తమ డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. శనివారం సరుకులు ఇస్తానని అందరికీ చెప్పడంతో దాదాపు 60 మంది దుకాణం వద్దకు వచ్చారు. ఆయన రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల నుండి 6--70 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు.