ఓ ఏనుగుల మంద ఏరు దాటుతుండగా.. ఓ మొసలి ఏనుగు పిల్లపై దాడి చేసింది. నోటితో ఏనుగు తొండాన్ని పట్టుకుంది. మొసలి దాడిని గ్రహించిన మిగతా ఏనుగులు పక్కకు తప్పుకోగా తల్లి ఏనుగు మాత్రం మొసలిపై ప్రతి దాడి చేసింది. బిడ్డను కాపాడి మంద వద్దకు పంపింది. అనంతరం మొసలిని తన బలమైన పాదాలతో తొక్కి తొక్కి చంపింది. ‘వైల్డ్ లైఫ్ కల్చర్1’ అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తన బిడ్డ జోలికొస్తే ఏ తల్లీ ఊరుకోదు కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.